భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేసియా దేశం తమ అత్యున్నత పౌర పుర స్కారమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’ అవార్డును’ ప్రకటించింది.

ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ అందించిన విశేష కృషికి గుర్తింపుగా ఇండోనేసియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఈ అత్యున్నత పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించారు. భారత్-ఇండోనేసియా దేశాల మధ్య చారిత్రక బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చడంలో ప్రధాని మోదీ పోషించిన పాత్రను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) ప్రయోజ నాల కోసం, ఆసియా-పసిఫిక ప్రాంతంలో శాంతి భద్రతల కోసం భారత్ అందిస్తున్న సహకారం అమోఘమైనదని ఆయన ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *