
ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్. ఈ సినిమా లోని తన పాత్ర కోసం తారక్ ఎన్నడూ లేని విధంగా భారీగా బరువు తగ్గారు. ఆమధ్య బయటకు వచ్చిన తారక్ అల్టా స్లిమ్ మేకోవర్ చూసి అభిమా నులు ఒకింత షాక్ కు గుర య్యారు. ఒక సినిమా కోసం ఇంతలా బరువు తగ్గా లా అని కంగారు పడుతూ, తమ హీరో లుక్ చూసి అభి మానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా తీవ్ర ఆందో ళన చెందారు. అయితే, ఎన్టీ ఆర్ బర్త్ డే కానుకగా విడు దలైన ‘డ్రాగన్’ గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కి పోయినప్ప టికీ, ఆ లుక్ వెనుక ఉన్న తారక్కష్టం వారిని ఇబ్బంది పెడుతూనే వచ్చింది. ఇం దులో ‘లూగర్’ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లుక్ కోసం ఎన్టీఆర్ తన ప్రాణం పెట్టి పనిచేశారు.
సినిమా కోసం, తను నమ్మిన పాత్ర కోసం తారక్ ఎంతటి రిస్క్ అయినా తీసుకోగలడు, ఏ స్థాయికైనా వెళ్లగలడు అని తన అంకిత భావంతో మరో సారి నిరూ పించారు. క్యారె క్టర్లోని ఇంటెన్సిటీ చూశాక ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టించి బోతు న్నాడో అని అందరిలో ఆసక్తి రెట్టింపయింది.


