- అటు పక్క పోతే హస్పిటల్ పక్కా!
- తనిఖీలు చేసినా మారని వైనం
- అన్ని పెద్ద హోటళ్లదీ ఇదే తీరు!
- బిల్లులు తప్ప మరేం లేదు
- పెద్ద హోటళ్లలో ఇదే తంతు
నగరంలో రెస్టారెంట్ అంటేనే జేబులకు చిల్లులు పడటం కామన్. ఎన్నో రోజుల నుంచి ఈ యవ్వారం నడుస్తోంది. హోటల్ బిల్లుతోనే జేబుకు చిల్లు పడితే పర్వాలేదు కానీ హోటల్ కు వెళ్లిన పాపానికి హాస్పిటల్ కు కూడా వెళ్లాల్సి వస్తేనే దారుణం.. అభినయ్ (పేరు మార్చాం) బంజారాహిల్స్ రోడ్ నం 12లో నివాసం ఉంటున్నాడు. వృత్తి రీత్యా డిజిటల్ మార్కెటర్ అయిన అభినయ్ ఓ సారి అదే రోడ్ నం 12లో ఉన్న ఓ పేరు మోసిన హోటల్ లో బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నాడు. అంతే తిన్నప్పటి నుంచి వాంతులు, విరోచనాలతో మంచమెక్కాడు. దెబ్బకు ఓ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. 3 రోజులు ఆసుపత్రి బెడ్ పై ఉండటంతో రూ. 35,000 ఫైనల్ బిల్ అయింది. అతడేదో ఐదెంకల జీతం సంపాదిస్తున్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఈ హోటల్ చేసి నిర్వాకానికి ఏదో లోన్ యాప్ లో ఎక్కువ వడ్డీకి లోన్ తీసుకుని అవస్థలు పడాల్సిందే. అభినయ్ ఒక్కడే కాకుండా ప్రతి రోజు ఏదో మూల ఈ హోటల్స్ నిర్వాకం వల్ల ఆస్పత్రుల పాలవుతూనే ఉన్నారు. చిన్న హోటల్స్ మాత్రమే ఇలా అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్స్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయనుకుంటే పొరపాటే. పేరు మోసిన పెద్ద హోటల్స్ ది కూడా ఇదే తంతు.
సింగిడి హైదరాబాద్: అధికారులు ఎన్ని సార్లు మెరుపు దాడులు చేసినా కానీ హోటల్ యజమానుల తీరు మారడం లేదు. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న మెరుపు తనిఖీలు చేపడుతూనే ఉన్నారు. ఈ తనిఖీల వల్ల కొన్ని రెస్టారెంట్లలో పెను మార్పులు వస్తుండగా.. కొన్ని రెస్టారెంట్లు మాత్రం అదే మూసను ఫాలో అవుతున్నాయి. తాజాగా గచ్చిబౌలిలోని అల్-సబా రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయగా.. ఆ రెస్టారెంట్ కిచెన్ వాతావరణం భయబ్రాంతులకు గురి చేస్తోంది.
The Al-Saba Restaurant in 📍#Gachibowli , #Hyderabad , found in Extremely #Unhygienic Conditions, during 🍽️ Food Safety Inspection Drive 🚨 by CMC across #Cyberabad .
📋 Hygiene Assessment
🏆 69/150 marks (46%)As part of routine #FoodSafety inspections across Cyberabad, CMC… pic.twitter.com/BRtqN0by0c
— Surya Reddy (@jsuryareddy) July 10, 2026

లైవ్ కిచెన్స్ ప్రారంభం: కొన్ని రెస్టారెంట్స్ పెను మార్పులకు శ్రీకారం చుట్టాయి. స్టార్ హోటళ్తో పాటు కొన్ని క్లౌడ్ కిచెన్లు కూడా ఇప్పుడు లైవ్ కిచెన్ పద్ధతిని స్టార్ట్ చేశాయి. కోల్పోయిన కస్టమర్ల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు నగరంలోని పలు రెస్టారెంట్లు సరికొత్తగా ‘లైవ్ కిచెన్ డిస్ప్లే స్క్రీన్’ విధానాన్ని తెరపైకి తెచ్చాయి. క్రమంగా నగరంలోని అన్ని రెస్టారెంట్లు ఈ ‘లైవ్ స్క్రీన్’ విధానాన్ని అమలు చేస్తే రాబోయే రోజుల్లో వినియోగదారుల్లో మరింత నమ్మకం ఏర్పడే చాన్సుంది.


