- చినుకు పడగానే చిత్తడవుతున్న మహానగరం
- ఇదే అదనుగా హైడ్రాపై అనేక ఆరోపణలు
- హైడ్రాపై స్ప్రెడ్ అవుతున్న నెగటివిటీ?
- పలుమార్లు సీరియస్ అయిన హైకోర్టు
- హైడ్రాది పబ్లిసిటీ పిచ్చంటూ ఆరోపణలు?
- ఈ ఆరోపణల్లో నిజమెంత!

హైడ్రా (Hyderabad Disaster Response and Asset Monitoring and Protection Agency) 2024 జూన్ ల ఏర్పాటయిన ఈ ఏజెన్సీ నగరంలోని చాలా మందిని వణికించింది. హైడ్రా కేవలం పేదలనే టార్గెట్ చేస్తోందని కొంత మంది, కాదు కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తోందని మరికొందరు, అక్రమార్కుల భరతం పడుతోందని ఇంకొందరు వాదిస్తూ వస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా కానీ హైడ్రాను తెచ్చింది నగరంలోని ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా సూడనీకి. అటువంటి హైడ్రా ముచ్చట్లకు రాజకీయాలు ఎంటర్ అయి గబ్బు లేపినయి. అసలు హైడ్రా వల్ల మంచి జరుగుతుందో లేక చెడు జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలోకి సామాన్యులను నెట్టేశాయి. కొన్ని సార్లు హైడ్రా(hydra) కు కోర్టుల నుంచి చుక్కెదురైన మాట వాస్తవమే. అంత మాత్రాన హైడ్రా ఏదో తప్పు చేస్తోందని మనం ఓ నిర్ణయానికి రాలేం. ఏదో కొందరు చెప్పిన దాన్ని పట్టుకుని హైడ్రా చేస్తుంది తప్పు, హైడ్రా చేసేది ఒప్పు అని నిర్ణయించడం అవివేకమే అవుతుంది. హైడ్రా వల్ల కొంత మందికి మేలు జరగ్గా మరికొంత మందికి హైడ్రా కన్నీళ్లను మిగిల్చిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
హైడ్రా (hydra) ఛైర్మన్‌గా సీఎం
హైడ్రా(hydra)కు ఛైర్మన్‌గా తెలంగాణ సీఎం వ్యవహరిస్తారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు హైడ్రాలో సభ్యులుగా ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ మేయర్‌కు హైడ్రాలో చోటు కల్పించారు. హైడ్రా కమిషనర్‌గా పోలీసు అధికారి ఏవీ రంగనాథ్‌ను నియమించారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్‌ను (DRF) విస్తృత పరిచి, ప్రత్యేక అధికారాలు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాకు విశేష అధికారాలు కల్పించింది. ఇందులో అదనపు సిబ్బందిని కేటాయించి, టీమ్ సైజును 800 నుంచి 2,200 కి పెంచారు.
హైడ్రా (hydra) చేసిందిదే..
ఫామ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు హైడ్రా 166 ఆక్రమ నిర్మాణాలపై చర్య తీసుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా 43.54 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని అక్రమార్కుల చెర నుంచి కాపాడింది. అత్యధికంగా గాజులరామారంలోని చింతల్ చెరువు ఒడ్డున 54 నిర్మాణాలను కూల్చేశారు. ఆ తర్వాత రాజేంద్ర నగర్‌లోని భూమ్రుక్ డౌలాలో 45 నిర్మాణాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌కు తాగు నీటిని అందిస్తున్న గండిపేట్ చుట్టూ 24, ఖాన్పూర్లో 14, చిల్కూర్ ప్రాంతంలో 10 నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేసినట్టు పలు రికార్డులు చెబుతున్నాయి.
హైడ్రా (hydra) రాజకీయ అస్త్రమయిందా?
మనం చూసుకున్నట్లయితే ఇసొంటి ముచ్చట్లు రాజకీయ దుమారం లేపడం సహజం. హైడ్రా విషయంలో కూడా అదే జరిగింది. అయితే హైడ్రా విమర్శలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ఎలాంటి ఒత్తిడులు వచ్చినా తగ్గేది లేదని గంటాపథంగా చెబుతోంది. కేవలం కొన్ని పార్టీల వ్యక్తులవనే కాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన వారి నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది.
Read now: https://site.epapersingidi.com/seethakkagovernment-takes-the-path-to-the-villages/
ఇలా చెప్పుకుంటూ పోతే హైడ్రా ఎన్నో ఆక్రమణలను తొలగించి ఎన్నో ఆస్తులకు కొత్త జీవం తీసుకొచ్చింది. అదే సమయంలో కొంత మంది పేదలు కూడా హైడ్రా వల్ల సఫర్ అయ్యారు. ఇక చివరగా ఒకే వ్యాక్యం చెప్పాలి.
There are no gains, without pains







