ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలో 50కి పైగా విధులను నిర్వర్తించే ఒక ముఖ్యమైన అవయవం. హార్మోన్ల ఉత్పత్తి, ప్రోటీన్ల సంశ్లేషణ వంటివి కీలకమైన పనులు ఇది నిర్వర్తిస్తుంది. అయితే జీవనశైలి కారణంగా కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది.

మధ్యం అధిక ప్రోటీన్ తీసుకునే వారు కాలేయంపై భారాన్ని పెంచి, దాని పనితీరును ప్రభావితం చేస్తుంది. కానీ కాలేయం పనితీరును మెరుగుపరచడానికి ఆయుర్వేదం కొన్ని మార్గాలను సూచిస్తుంది. ముఖ్యంగా నేటి కాలంలో ఫ్యాటీ లివర్ సాధారణ సమస్యగా మారింది. తప్పుల ఆహారపు అలవాట్ల కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుంది. కానీ కాలేయాన్ని నిర్విషీకరణ చేసి, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటంలో కారెట్లు కీలకంగా పనిచేస్తాయి. క్యారెట్లు, ఆపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు. పుదీనాను కలిపి జ్యూస్ తయారు వేసుకుని తాగాలి. అయితే ఈ జ్యూస్ తయారుచేసేటప్పుడు అందులో చక్కెర లేదా ఉప్పు కలపవద్దు. ఈ జ్యూస్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఈ జ్యూస్ ఫ్యాటీ లివర్కు మాత్రమే కాకుండా కామెర్లకు కూడా మేలు వేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. క్యారెట్లు కాలేయ కణాలను బలపరిచి, వాటిని నష్టం నుంచి కాపాడతాయి. క్యారెట్లలోని పదార్థాలు కాలేయంపై ఉండే అధిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. యాపిల్స్ లోని గుణాలు కాలేయ వాపును తగ్గించడంలో, కణాల పునరుత్పత్తిలో సహాయపడతాయి. ద్రాక్ష పండ్లు కాలేయంలో ఎంజైమ్లను పెంచుతాయి. అవి ప్రోటీన్ల జీర్ణక్రియ, సంశ్లేషణకు సహాయపడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *