నగర శివారులో జెట్ స్పీడ్తో చిత్రీకరణ

“రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.”

ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జెట్ స్పీడ్లో సాగుతుండగా.. చిత్ర బృందం ఎలాంటి విరామం లేకుండా వరుస షెడ్యూళ్లతో దూసుకెళు తోంది. స్పిరిట్ షూటింగ్ ఇప్పటికే దాదాపు 70 శాతం పూర్తయినట్లు, కేవలం 30 శాతం చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ కూడా పూర్తిస్థాయిలో సమయం కేటాయిస్తూ.. ప్రతి యాక్షన్ సన్నివేశాన్ని డూప్ లేకుండా స్వయంగా చేస్తున్నారని సమాచారం. యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ అంకితభావం చిత్ర యూనిట్ను కూడా ఆకట్టుకుంటోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ప్రతి సన్నివేశాన్ని, షూటింగ్ షెడ్యూల్ను పక్కాగా సిద్ధం చేసుకునే ఆయన.. సెట్పైకి వెళ్లిన తర్వాత మాత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసే దర్శకుడిగా పేరొందాడు. స్పిరిట్’ విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ప్రణాళిక కారణంగానే షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా కొనసాగుతోందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *