సమగ్ర దర్యాప్తు దిశగా ప్రభుత్వం చర్యలు సిట్ వేసే యోచనలో ప్రభుత్వం.

హైదరాబాద్, జులై 7 (సింగిడి): ధరణి పోర్టల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమా లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భూ రికార్డులు, రిజిస్టేన్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విజిలెన్స్ విభాగం ద్వారా లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వెలుగులోకి వస్తున్న అక్రమాలపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. భూమి యజమాని వేలిముద్ర, ఓటీపీ ధ్రువీకరణ లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. భద్రతా వ్యవస్థలను బైపాస్ చేస్తూ ప్రత్యేక సాప్ట్వేర్లను వినియోగించి లావాదేవీలు నిర్వ హించినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.