
చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. మెగా 158 వర్కింగ్ టైటిల్ గా ప్రచారంలో ఉన్న దీనిపై టీమ్ అప్ డేట్ పంచుకుంది. షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోందని తెలిపింది.
మునుపెన్నడూ చూడని భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని.. చిరును కొత్త కోణంలో చూస్తారని వెల్లడించింది. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ సారధ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. సినిమాకు ఈ సీన్స్ హైలైట్గా నిలవనున్నాయి. చిరు ఇందులో రిస్క్ కూడిన స్టంట్స్ చేస్తున్నారని.. త్వరలో దీని టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు టీమ్ వెల్లడించింది. ‘వాల్తేర్ వీరయ్య’ విజయం తర్వాత చిరంజీవి -బాబీ కాంబోలో ఈ చిత్రం రానుండడంతో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే పొల్లాచ్చిలో ఓ కీలక షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. అక్కడ కొంత టాకీతో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా తీసినట్లు ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు.


