- ఎనీటైమ్ అమ్మకాలు,కొనుగోళ్లు
- మామూళ్లను మరువలేకపోతున్న అధికారులు !
- కోల్ సిటీలో పేలని టపాసుల్లా డీజీపీ ఆంక్షలు
గోదావరిఖని,జూన్ 7(సింగిడి): పీడీఎస్ రైస్ స్మగ్లింగ్,మరి కొన్ని అక్రమ దందాల విషయంలో రాష్ట్ర కొత్త డీజీపీ సివీ ఆనంద్ ఇటీవల అత్యంత కఠినమైన ఆంక్షలు విధించారు,కొన్ని జిల్లాల్లో అవి బలంగా అమలవుతున్నా, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మాత్రం ఏమాత్రం పనిచేయటంలేదు.
తెల్లవారంగానే టీవీఎస్ మోపెడ్లు,ఆటోలతో “బియ్యం కొంటాం” అంటూ బాజాప్తా వీదుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు.
అనూహ్యంగా సింగిడి కెమెరాకు చిక్కారు.
ఎవరి ధీమాతో ఇంతటి బరితెగింపు..?
తనకు అపరిమిత శక్తులు ఉన్నాయని భావించే ఓ ప్రజాప్రతినిధి పూర్తి ఆశీస్సులు,సంబంధిత ఓ పవర్ ఫుల్ శాఖకు చెందిన
ఓ అధికారికి రక్షణ కవచాలుగా మారాయి. ఇక ఇంకేముందీ పేదల బియ్యాన్ని అక్రమంగా తరలించే స్మగ్లర్లకు సదరు ఆ అధికారి పూర్తి లైసెన్స్ ఇచ్చేసాడు.బదులుగా నెల నెలా మంచి మామూళ్ల సంచి రావటమే ఇందులోని చిదంబర రహస్యమట. దీంతో జిల్లా మొత్తం ఆగిపోయిన సదరు మాఫియా స్థానికంగా మాత్రం ఆగటంలేదు. ఫలితంగా “బియ్యం గొంటాం, బియ్యం గొంటాం” అనే స్వరం కోల్ సిటీ కాలనీల్లో నిత్యం మారుమోగుతోంది. కాగా అన్ని ప్రాంతాల్లో ఈ దందాను అదుపుచేసిన డీజీపీ గారు ఓ సారి మా వైపు కూడా చూడరా సార్ అని పలువురు కోరుతున్నారు.




