అధిక ధరకు కొనలేక లబ్ధిదారుల అవస్థలు

తక్కువ ధరకే ఇసుకను సరఫరా చేయాలి బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు డిమాండ్ ఇసుకపై బిజెపి నేతల నిరసన దీక్ష..

జమ్మికుంట, జూలై 6 (సింగిడి): సముద్రం తలాపున పెట్టుకుని చాప ధూపకేడ్చినట్లు జమ్మికుంట పట్టణం మానేరు పరివాహక ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇసుక కోసం ప్రజలు అలమటిస్తున్నారని బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు అన్నారు. సోమవారం జమ్మి కుంట గాంధీ చౌరస్తాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు అతి తక్కువ ధరకు ఇసుకను సరపర చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కొలకాని రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అర్హులైన నిరుపేదలకు దలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని అందుకోసం విడతలవారీగా లబ్దిదారులకు ఐదు లక్షల రూపాయలను అందిస్తుందని తెలిపారు. కానీ లబ్దిదారులకు ఇసుక దొరకక 2000 రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇసుక గతంలో లభించేదని ప్రస్తుతం 7000 చెల్లించినప్పటికీ ఒక ట్రాక్టర్ ఇసుక వారికి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కు పాదం మోపడంతో మానేరు పరివాహక ప్రాంతం నుండి ఇసుక సరఫరా నిలిచిపోయింది. ఇసుక సరఫరా నిలిచిపోవడంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపల ఇంటి నిర్మాణం జరగకపోతే వారికి రావలసిన బిల్లులు రావని వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లబ్దిదారులను కోరుతున్నారు. కానీ ఇంటి నిర్మాణం జరగాలంటే ఇసుక దొరకాలి ఒక ట్రిప్పు ఇసుక ధర 7వేల రూపాయల నుండి 8 వేల రూపాయల ధర పలకడంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబీసీ మోర్చా ర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ ధార్మిక సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్ బచ్చు శివకుమార్ కౌన్సిలర్ తూర్పాటి శంకర్ కొండ్ల నాగేష్ యాంసాని సమ్మయ్య తోపాటు పలువురు బిజెపి కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *