ACB: రెండు లక్షల దురాశ 32 లక్షల్ని పట్టించింది!

Share this:
  • పెద్దపల్లిలో ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ

 

దురాశ దుఖానికి చేటని పెద్దలు ఊరికే చెప్పలేదు. తాజా ఘటన ఈ సామెతకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. 2 లక్షలు కావాలని దురాశకు పోతే.. 32 లక్షలు ఏసీబీ అధికారులకు దొరికాయి. ఉమ్మడి కరీంనగర్ లోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

పెద్దపల్లి -( సింగిడి): పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) సతీష్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎంబీ రికార్డు నమోదు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మంగళవారం డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం సతీష్‌ను అదుపులోకి తీసుకుంది.ఆ తదుపరి సోదాల్లో సుమారు మరో 32 లక్షలు సదరు ఏఇ వద్ద దొరకటంతో,కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ ఘటనపట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share this:
error: Content is protected !!