Ind VS Eng: నేడైనా బోణీ కొట్టేనా!

Share this:
  • నేడు కూడా ఓడితే సిరీస్ గోవిందా
  • మరి అయ్యర్ సేన ఏ విధంగా రాణిస్తుందో?
  • సంజూని ఆడిస్తారా?
  • గంభీర్ కు చీవాట్లు పెడుతున్న నెటిజన్లు

 

సింగిడి స్పోర్ట్స్: పసికూన ఐర్లాండ్ తో ఊహించని పరాభవం తర్వాత ఇంగ్లండ్ టూర్ కు వెళ్లిన అయ్యర్ సేనకు ఏదీ సరిగ్గా కలిసి రావట్లేదు. ఆడిన మూడు మ్యాచుల్లో వర్షం వల్ల ఒకటి రద్దవగా మిగతా రెండు టీ20ల్లో మెన్ ఇన్ బ్లూ పరాజయం పాలయ్యారు. మరి నేడు జరిగే నాలుగో టీ20లోనైనా గెలుపు బాట పడతారా అని అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వర్షం వల్ల ఒకటి రద్దవడంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో నాలుగు మాత్రమేమ మిగిలాయి. అందులో మొదటి రెండు మ్యాచులు ఓడిపోవడంతో ఇక నేడు గెలిస్తేనే సిరీస్ లో నిలిచే పరిస్థితి తలెత్తింది. మరి బ్యాటింగ్, బౌలింగ్ అన్నింటా విఫలమవుతూ వస్తున్న అయ్యర్ సేన మరి నేటి పోరులో ఎంత వరకు ప్రభావం చూపుతారో వేచి చూడాలి. 

Share this:
error: Content is protected !!