Flash: ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్లో ప్రమాదం..!

Share this:

సింగిడి సినిమా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మూవీలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మని ఓ విషపురుగు కుట్టినట్టు సమాచారం. ఆ నటుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వినికిడి. విష పురుగు కుట్టడంతో జ్వరం, తీవ్రమైన నొప్పితో నటుడు రాజేష్ శర్మ ఆసుపత్రిలో చేరారట. అతనికి ప్రస్తుతం కోల్‌కతాలో డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. 

సాధారణ పురుగే అని అనుకున్నా.. 

నటుడు రాజేష్ శర్మను కుట్టింది సాధారణ పురుగేనని తొలుత నిర్లక్ష్యం చేసినట్టు తెలుస్తోంది. పురుగు కుట్టిన ఆరు గంటల తర్వాత లక్షణాలు కనిపించాయని, హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా ఫ్లైట్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!